రైతు భూమిని తిరిగి అప్పగిం చేటందుకు అంగీకరించిన మాజీ ఆర్టీఐ కమిషనర్..
కారేపల్లి నేటి ధాత్రి
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలోని ఆల్యితండా గ్రామం సమీపంలో గల వ్యవసాయ భూమి పచ్చిపాల భద్రయ్య కు చేందిన.ఒక ఎకరం ఇరువై గుంటలు భూమి కబ్జాకు గురైందని అట్టి భూమినీ గత ప్రభుత్వం హయాంలో ఆర్టీఐ కమిషనర్ కుటుంబ సభ్యులు కబ్జాకు పాల్పడ్డారని రైతు పచ్చిపాల భద్రయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తు పలుమార్లు ఆందోళనకు దిగారు అయితే ఇదే విషయం భద్రాచలం ఐటిడిఏ కోర్టులో ఉండగా మాజీ కమిషనర్ భార్య కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి భద్రయ్య కు చెందిన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్లతో భూమిని దున్నుతుండగా భద్రయ్య అతని కుటుంబ సభ్యులు అడ్డుకునేటందుకు ప్రయత్నం చేశారు దీనితో భద్రయ్య పాలి వారి కుటుంబ సభ్యులను వారు అడ్డు పెట్టుకోవడంతో మనస్థాపంకి గురైన భద్రయ్య అక్కడే పురుగుల మందు తాగి పడిపోవడంతో ఇది గమనించిన అతని కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పటల్ కు తరలించారు భద్రయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా ఈ విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ హాస్పిటల్ కి వెళ్లి భద్రయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు . రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అనంతరం ఇట్టి విషయంపైన ఎమ్మెల్యే నివాసంలో ఇరు వర్గాల వారిని పిలిపించి ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీ పెద్దల సమక్ష్యంలో నిజ నిజాలు తెలుసుకొని ఆ భూమి పచ్చి పాల భద్రయ్య దే అని వారితో మాట్లాడి కబ్జాకు గురైన పచ్చిపాల భద్రయ్య భూమిని తిరిగి అప్పగించేటందుకు ఆర్టిఐ మాజీ కమిషనర్ అంగీకరించడంతో పాటు పరస్పరం ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులను తిరిగి వెనక్కి తీసుకుని రాజీపడే విధంగా ఎమ్మెల్యే సమక్షంలో మాట్లాడుకొని భద్రయ్య భూమి కబ్జా సమస్యను వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరిష్కరించడంతో పాటు పచ్చిపాల భద్రయ్య కుటుంబానికి భూమిని తిరిగి అప్పగించుటకు ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కి భద్రయ్య కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని భద్రయ్య కుటుంబానికి ఎమ్మెల్యే చేసిన న్యాయం గురించి తెలిసిన ఉసిరికాయలపల్లి గ్రామ ప్రజలు పలువురు మండల నాయకులు ఎమ్మెల్యేను అభినందిస్తూ న్యాయాన్ని కాపాడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని కొనియాడారు.