నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఘనంగా వడ్డె ఓబన్న 218 వ జయంతి వేడుకలు
నర్సంపేట,నేటిధాత్రి:
ఆంగ్లేయులతో జరిగిన పోరులో సర్వ సైన్యాధ్యక్షుడు ఉన్న వడ్డె ఓబన్న మొదటితరం స్వతంత్ర సమరయోధుడు అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 218 వ జయంతి వేడుకలు నర్సంపేట పట్టణానికి చెందిన వడ్డెర సంఘం ఆధ్వర్యంలో 15 వ వార్డులో ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వడ్డెర ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓబన్న జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అధికారకంగా జరుపుకుంటున్నారన్నారు. వడ్డెర సంచార జాతి కులమునకు చెందిన వడ్డెర ఓబన్న రేనాటి ప్రాంతంలో జన్మించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న సమయంలో ఘర్షణలు జరిగినాయి. ఘర్షణలు క్రమేపి సాయుధ పోరాటాలుగా మారాయి. ఆ పోరాటాల్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాట పోరులో సైన్యాధ్యక్షుడుగా వడ్డెర ఓబన్న పోషించిన వీరోచిత పాత్రను చరిత్రలో మర్చిపోరానిధి దొంతి మాధవరెడ్డి తెలియజేశారు.పోరాటంలో ఉరుకులు పెట్టించడంలో ముఖ్యపాత్ర పోషించిన వీరుడు వడ్డేర ఓబన్న నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడుగా తన నాయకుడినితో వారి కుటుంబాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషించిన ఓబన్న వడ్డెర జాతీనే కాకుండా సభ్య సమాజం గర్వించదగ్గ వ్యక్తి అని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొనియాడారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మున్సిపల్ ప్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్, స్థానిక కౌన్సిలరు ఓర్సు అంజలీ, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవి కుమార్, బిట్ల మనోహర్, జన్ను మురళీ, మైదం రాకేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.