# ఘనంగా ప్రపంచ రేబీస్ దినోత్సవం.
నర్సంపేట,నేటిధాత్రి :
ఎలాంటి పరిస్థితుల్లోనైనా కుక్కకరిసిన వెంటనే టీకాలు వేయించుకోవాలని ప్రాంతీయ పశు వైద్యశాల ఏడీ.డాక్టర్ బిఎన్ రెడ్డి అన్నారు. ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా నర్సంపేట
ప్రాంతీయ పశు వైద్యశాల వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా రైతులకు,విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి టీకా కార్యక్రమం చేపట్టారు.ఇండ్లల్లో పెంచుకొనే కుక్కలకు తప్పనిసరిగా క్రమపద్ధతిలో టీకాలు వేయించాలి.
అదేవిధంగా స్థానిక పాఠశాలలో విద్యార్థులకు వాటిపట్ల అవగాహణ నిర్వహించారు.రేబీస్ సోకిన పిచ్చికుక్క,ఇతర కుక్కల నుండి వ్యాది ఏవిధంగా వస్తుంది, కుక్కలు కరవ కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ కరిచినచో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ నేపథ్యంలో 23 కుక్కలకు మరియు 19 గెదెలకు ఉచిత టీకాలు వేశారు.ఈ కార్యక్రమంలో బానోజీపేట పశువైద్యారికారి డాక్టర్ ఎం.వింధ్య,పాఠశాల హెడ్ మాస్టర్ రామకృష్ణ,ప్యార వెట్, స్టాఫ్ మాసు రబ్బానీ,రాజ్ కుమార్,గోపాలమిత్ర రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.