
Sabalenka Wins US Open with Record Prize Money
యూఎస్ ఓపెన్ విజేత సబలెంక.. ఆమెకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
అత్యంత ఆసక్తికరంగా సాగిన యూఎస్ ఓపెన్‌లో బెలారస్ క్రీడాకారిణి అర్యనా సబలెంక విజేతగా నిలిచింది. అమెరికాకు చెందిన అనిసిమోవాపై 6-3, 7-6 (3)తో వరుస సెట్లలో విజయాలు సాధించిన సబలెంక విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది.
అత్యంత ఆసక్తికరంగా సాగిన యూఎస్ ఓపెన్‌లో బెలారస్ క్రీడాకారిణి అర్యనా సబలెంక (Aryna Sabalenka) టైటిల్ సాధించింది. అమెరికాకు చెందిన అనిసిమోవాపై 6-3, 7-6 (3)తో వరుస సెట్లలో విజయాలు సాధించిన సబలెంక విజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సబలెంక తాజా యూఎస్ ఓపెన్ టోర్నీ మొత్తానికి ఒక్క సెట్‌ను మాత్రమే చేజార్చుకుంది (US Open champion payout).