రైతులందరికీ సకాలంలో యూరియా కొరత లేకుండా అందజేయాలి
సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ
గుండాల(భద్రాద్రికొత్తగూ డెం జిల్లా),నేటిధాత్రి:
రైతులందరికీ సకాలంలో యూరియా కొరత లేకుండా అందించాలని గురువారం గుండాల తహసిల్దార్ రంగు రమేష్ కు వినతి పత్రం ఇచ్చి ప్రాథమిక సహకార పరపతి సంఘం(పిఎసిఎస్)ముందు సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టి పంటలు వేస్తే ఆ పంటలకు మందులు వేయాలంటే యూరియా కొరత తీవ్రంగా ఉందని జిల్లా వ్యవసాయ శాఖఅధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రోజుల తరబడి ప్రాథమిక సహకార పరపతి సంఘం (పిఎసిఎస్) ముందు క్యూలో నిలబడాల్సి వస్తుందని అయినా యూరియా దొరకడం లేదని వాపోయారు.ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పటికీ రైతులకు యూరియా అందించటంలో పూర్తిగావిఫలమయ్యారని అన్నారు.ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యూరియా కొరత తీర్చకుంటే త్వరలో జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యాసారపు వెంకన్న, పర్శక రవి,ఈసం కృష్ణన్న, మానాల ఉపేందర్, వాగబోయిన సుందర్ రావు, ఈసం మల్లయ్య, రైతులు పాల్గొన్నారు.