ఉపాధిహామీ పనుల జోరు
హసన్‌పర్తి మండలంలోని సీతానాగారం గ్రామంలో వర్షాకాలం రావడంతో కూలీలు భారీసంఖ్యలో ఉపాధిహామీ పనులకు వస్తున్నారని ఎపిఓ విజయలక్ష్మి తెలిపారు. కాలం రావడంతో ఎవరి పొలంలో వారు మట్టి కొట్టుకపోకుండా కూలీలు అధికసంఖ్యలో పాల్గొన్నారన్నారు. మబ్బులు చల్లపడటంతో కూలీలు సంతోషంగా పనులు చేస్తున్నారన్నారు. రైతులు వారివారి పొలాల్లో మట్టిని పోసుకుంటున్నారని, ఉపాదిహామీ కూలీల వద్దకు వెళ్లి వారితో మాట్లాడటంతోపాటు వారి అవసరాలను తెలుసుకున్నానని చెప్పారు. ఇంతమంది కూలీలు వందరోజుల పనిని వినియోగించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయిలయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్, టిఎ సృజన తదితరులు పాల్గొన్నారు.