జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలో 97 బూత్ లో పెద్దపల్లి పార్లమెంటు బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు శనివారం రోజున జెండా ఆవిష్కరణ జరిపారు.మొదటిసారి నర్వ గ్రామానికి పెద్దపల్లి పార్లమెంటు బిజెపి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విచ్చేసిన సందర్భంగా నర్వ గ్రామ బిజెపి పార్టీ నాయకులు శ్రీనివాస్ , కార్యకర్తలు,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళహారతులతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు సీట్లతో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రస్థానం నేడు అతిపెద్ద రాజకీయ ప్రజాస్వామ్య పార్టీగా గుర్తింపు పొందిందని దీని వెనకాల ఎంతోమంది నిస్వార్ధ సేవ త్యాగం దాగి ఉందని,నేడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జెపి నడ్డా అధ్యక్షతన ముందుకు సాగుతుందని రానున్న లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మూడోసారి దేశ ప్రధానమంత్రి అవుతారని, అలాంటి ప్రభుత్వంలో నేను ఉన్నట్లయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే భాగ్యం మన ప్రాంత ప్రజలకు లభిస్తుందని,కనుక మీరంతా మంచి మనసుతో ఆలోచించి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరడం జరిగింది.
అనంతరం నర్వ గ్రామానికి చెందిన పొట్టాల నాగరాజుకి కండువగప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దుర్గం ఎల్లయ్య,కామెర లక్ష్మణ్,అసపెల్లి తిరుపతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.