
Cotton Crop Damaged by Unseasonal Rains
అకాల వర్షాలతో పత్తి పంటకు నష్టం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా నష్టపోయింది. పత్తి కాయలు కుళ్ళిపోవడం, పువ్వులు, కాడలు రాలిపోవడంతో రైతులు దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నష్టాలను అధిగమించడానికి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో 5,000 హెక్టార్లకు పైగా పత్తి సాగు చేయగా, వర్షాల వల్ల పంట దెబ్బతింది. ఝరాసంగం మండల మేదపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపారు.