
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం శాంతినగర్ లొ దుర్గా టైలర్స్ దగ్గర టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నరేష్.ప్రతాప్. సాయిబాబు తదితరులు మాట్లాడుతూ ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా మిషన్ ని కనిపెట్టిన అమెరికన్ రిలయన్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.కొద్ది సంవత్సరాల క్రితం రెడీమేడ్ బట్టలు వాడుకలోకి రావడంతో ప్రస్తుతం టైలరింగ్ చేస్తున్న వారి బ్రతుకులు దూర్బాలంగా తయారయ్యాయని ఏ ప్రభుత్వాలు వచ్చినా టైలర్స్ని పట్టించుకున్న నాధుడే లేడని కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మా సమస్యల్ని పట్టించుకోవాలని మాకు బ్యాంకుల ద్వారా లోన్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లెల నరేష్ గౌరవ అధ్యక్షులు ప్రతాప్ సాయి టైలర్. ఊడ రాము తదితరులుపాల్గొన్నారు