చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీసీపీఎల్ – (చిట్యాల క్రికెట్ ప్రీమియర్ లీగ్) జయశంకర్ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడా పోటీలో పాల్గొన్న డ్రీమ్స్-11 క్రీడ జట్టుకు క్రీ.శే.ఎంజాల బిక్షపతి స్మారకార్థం మీదుగా రేగొండ వాత్సవ్యులు ఎంజాల రాజు ఆధ్వర్యంలో గంగాధర రాజు చేతుల మీదుగా బహుకరించారు. టోర్నమెంటులో క్రీడాజట్టు గెలుపొంది రోపి విజయతీరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు కటుకూరి నరేందర్, నేపాలి రాకేష్ టీం జట్టు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.