ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ తూర్పు నియోజకవర్గం, 25వ డివిజన్ మండిబజార్ సెంటర్లో మంత్రి కొండా సురేఖ మురళీధరరావు ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బస్వరాజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో, చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బస్వరాజ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ నిర్వహించిన పోరాట పటిమను కొనియాడారు. చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో చాకలి ఐలమ్మ జన్మించారు అని, పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో అయిలమ్మకు బాల్య వివాహం జరిగింది అని, వీరిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడం, వీరి కులవృత్తిగా చాకలి వృత్తిని నిర్వహించేవారు. 1940 నుండి 1944 కాలంలో విసునూర్ దేశ్ముఖ్ మరియు రజాకార్లకు వ్యతిరేకంగా ఎర్ర జెండా పట్టింది చాకలి ఐలమ్మ అని అన్నారు. అగ్రకులాల స్రీలు వారిని కూడా దొర అని పిలిపించుకునేవారి వారి సంస్కృతికి చరమగీతం పాడారు అయిలమ్మ అని, ఈభూమి నాది పండిన పంట నాదని, దొర ఎవ్వడు అని, నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి దక్కించుకోగలరు అని, పోరు నిర్వహించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, విష్ణుర్ దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డిల గూండాలను కొంగు నడుముకు చుట్టి కొడవలి చేత బట్టి తరిమికొట్టారు అని, జనగామ తాలూకా ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్ర మహాసభలను పెట్టి ఎర్రజెండా చేపట్టి దొరల ఆధిపత్యాన్ని ఊరూరాచాటి చెప్పారని, తెలంగాణ తొలి దశ స్వాతంత్ర పోరాటంలో, భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తోట వేణుమాధవ్, బాగాజీ అశోక్, జన్ను మల్లేష్, బస్వరాజు సాంబయ్య, లవణ్, పోతురాజు లలిత, కొల్లూరి మల్లేశం, గుమ్మడి సురేష్, పవన్ కుమార్, సింగారం నరేష్, పోలోజు గోపి తదితరులు పాల్గొన్నారు.