
Kickboxing District General Secretary Madasi Srinivas
రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో జిల్లాకు రెండు బంగారు పథకాలు
కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్
భూపాలపల్లి నేటిధాత్రి
జూన్ 28, 29 తేదీలలో మహబూబ్ నగర్ లో నిర్వహించిన తెలంగాణ కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మ్యూజికల్ క్రియేటివ్ ఫామ్ విభాగంలో టి హరిణి బంగారు పతకం, బి మగ్న నిర్వాన వెండి, టి దృతిపర్ణిక, ఎం విధ్విన్, బి లవణ్ కుమార్, బి ఆరాధ్య లు రజిత పతకాలు సాధించారని తెలిపారు. క్రియేటివ్ వెపన్ విభాగంలో పి అవిక వెండి పతకం, టి హరిణి, కె కౌశిక్ మగ్న నిర్వాన రజిత పతకాలు, చిల్డ్రన్, ఎంగెస్ట్ కేటగిరి పాయింట్ ఫైటింగ్ విభాగంలో బి ఆరాధ్య వెండి పతకం, టి హరిణి రజిత పతకం, బి మాగ్న నిర్వాన, కె హరిణి, టి దృతిపర్ణిక లు వెండి పతకాలు, ఎం విధ్విన్ బంగారు , కె కౌశిక్, ఎం విధిష దేవి రజిత పతకాలు, ఎస్ సంజన బంగారు పతకం సాధించారన్నారు. అదేవిధంగా లైట్ కాంటాక్ట్ ఫైటింగ్ విభాగంలో ఎం విధిష దేవి, ఎస్ సంజన, బి లవణ్ కుమార్ లు బంగారు పతకాలు, కె హరిణి రజిత పతకాలు, సీనియర్ మాస్టర్స్ విభాగంలో క్రియేటివ్ ఫామ్, క్రియేటివ్ వెపన్ విభాగాలలో జి అశోక్ వెండి, రజిత పతకాలు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన తమ విద్యార్థులను తెలంగాణ కిక్ బాక్సింగ్ అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి మహిపాల్ లు ప్రత్యేకంగా అభినందించినట్లు ఈ సందర్భముగా మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు.