ముత్తారం :- నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశానుసారం అడవి శ్రీరాంపూర్ గ్రామాన్ని గత నెల ఇంటింటికి ఇంటర్నెట్ పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా టి ఫైబర్ ఎండి వేణు ప్రసాద్ అడివి శ్రీరాంపూర్ ని సందర్శించి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా జరుగుతుంది వాటిలో నాణ్యతలో ఏమైనా లోపాలు ఉన్నాయ అని ప్రజలను తెలుసుకోవడం జరిగింది ఎలా ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని వారు పర్యవేక్షించడం జరిగింది. అలాగే గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయమును మరియుజిల్లా పరిషత్ పాఠశాలను కూడా సందర్శించి పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రామాన్ని ఐటీ శాఖ మంత్రి మంత్రిదుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశానుసారం టీ ఫైబర్ వారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని వారు చెప్పడం జరిగింది అలాగే పయనీర్ కంపెనీస్ సిబ్బందికి అడవి శ్రీరాంపూర్ గ్రామ ప్రజలకు అంతరాయం లేకుండా ఇంటర్నెట్ మరియు టీవీ సేవలు నాణ్యతతో కూడినవి అందుబాటులో అతి త్వరలో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అధికారులు ప్రణవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు