New Sarpanch Assures All-Round Development of Thummanapalli
తుమ్మనపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా
◆-: సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రమైన తుమ్మనపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలోనే తనను అత్యధిక మెజార్టీ అయిన 92 ఓట్ల తో గెలిపించిన తుమ్మనపల్లి గ్రామ ప్రజల సహకారం మరువలేనిది అన్నారు.తనకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్ రావు, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేశం, గ్రామ అధ్యక్షులు వెంకట్ రెడ్డి మాజీ ఎంపీటీసీ నవాజ్ రెడ్డి ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో తుమ్మనపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు.
