TS UTF State Education Conference Poster Launched
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 27 :
ఛలో జనగామ ను జయప్రదం చేయాలని టిఎస్ యుటిఎఫ్ శామీర్ పేట్ మండల అధ్యక్షుడు తిరుమలేష్ అన్నారు. మేడ్చల్ జిల్లా తుంకుంట మునిసిపల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రేపు జనగాంలో జరగబోయే టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకట రెడ్డి, ఉపాధ్యాయులు అన్నపూర్ణ వనజ ,శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డి మహేష్ ,రజిని, వరలక్ష్మి, శ్రీదేవి మంజుల, పద్మ, భాగ్యరేఖ, రవి తదితరులు పాల్గొన్నారు.
