వనపర్తి లో రోడ్ల విస్తరణ బాధితులకు సన్మానము చేసిన ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి మార్కింగ్ వాకింగ్ లో నష్టపోయే బాధితులు కలిసి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అధికారులతో కలిసివివేకానంద చౌరస్తా నుండి రామాలయం వరకు రోడ్ల విస్తరణలో నష్టపోయే బాధితుల అభిప్రాయాలను సేకరించారు ఎంతో కాలంగా కర్నూల్ రోడ్ లో రోడ్ల విస్తరణ పెండింగ్ ఉండడంతో కొత్త బస్టాండ్ దగ్గర రాజావారి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర రోడ్డు చిన్నగా ఉండడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వనపర్తి పట్టణ ప్రజల భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే మెగా రెడ్డి నష్టపోయే బాధితులను ఒప్పించి రోడ్ల విస్తరణ చేపట్టడంపై ప్రజలు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు .ఈసందర్భంగా రోడ్ల విస్తరణ కు ముందుకు వచ్చిన ఎస్ ఎల్ ఎన్ రమేష్ రాజు షబ్బీర్ వినోద్ లకు ఎమ్మెల్యే మెగారెడ్డి శాలువతో సన్మానము చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్ ఆ ర్ డి ఓ రెవెన్యూ జిల్లా అధికారులు టౌన్ ఎస్సై హరిప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ కౌన్సిలర్లు బ్రహ్మం సుబ్బరాజు చుక్క రాజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు దక్కాకుల సతీష్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ డి వెంకటేష్ వ్యాపారస్తులు కూన వెంకటేశ్వర్లు బట్టల షాప్ ల యజమానులు తదితరులు ఉన్నారు