Tribute to Social Reformer Jyotirao Phule
సామాజిక న్యాయదిక్సూచి జ్యోతిరావు పూలే
టి,ఎన్,ఎస్,ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి
సిరిసిల్ల టౌన్,నేటిధాత్రి:
సామాజిక న్యాయదిక్సూచి మహాత్మా జ్యోతిరావు పూలే అని టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు,టిడిపి వేములవాడ నియోజకవర్గ అడాహాక్ కమిటీ సభ్యులు మోతె రాజిరెడ్డి అన్నారు.
సామాజిక న్యాయం,మహిళా విద్య, సమాన హక్కుల కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన భాందవుడు అని పేర్కొన్నారు. సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్యస్పూర్తిగా నిలిచిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
