ఎంపీ మల్లు రవికి సన్మానం..
కల్వకుర్తి /నేటి ధాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కల్వకుర్తి పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి శనివారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మనీల సంజీవ్ కుమార్, వైస్ చైర్మన్ పండిత్ రావు ఎంపీ మల్లు రవిని సన్మానించారు. అనంతరం మార్కెట్ ను సందర్శించి మార్కెట్ లో మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో నూతన భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.