నిజాంపేట, నేటిదాత్రి
నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ ఆవరణలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ
అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు జ్యోతిబాపూలే కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు. అన్నగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. తన చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలేను పెళ్లి చేసుకొని ఆమెకు చదువు నేర్పిఆమెను భారత దేశానికే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిబాపూలే అన్నారు. ఆయన ఆశయాలను నెమరు వేసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల తాజా మాజీ ఉపసర్పంచ్ కొమ్మాట బాబు బైండ్ల నందు గుడ్ల బాబు గరుగుల రాజు బండారు చంద్రo కిషన్ నాయక్ చందుతదితరులు పాల్గొన్నారు.