
రేగొండ,నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఎన్నికకాగా శుక్రవారం బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యడు వెన్నంపల్లి పాపన్న శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం శాలువాతో సత్కరించి పార్టీ ముందస్తు కార్యకలాపాలపై చర్చించారు.వారి వెంట బీజేపీ సీనియర్ నాయకులు కాంతలా నారాయణ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శ పెండల రాజు,చల్ల విక్రమ్ తదితరులు ఉన్నారు.