నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా.కే.రాజేష్ రెడ్డి.
నాగర్ కర్నూల్ /నేటి ధాత్రి.
వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలలో ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు గురై కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నారని.. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని..నాగర్ కర్నూల్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సోమ వారం అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రతి ప్రయాణికుడు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం.. రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్-నాగర్ కర్నూల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో.. రోడ్డు భద్రత-ప్రజల క్షేమంపై పోస్టరును ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాసులు,వెంకటేష్, సుమంత్,రాజశేఖర్ శర్మ, శ్రీశైలం,గంధం రాజు,గౌస్, ఖాజా, రాజు తదితరులు పాల్గొన్నారు.