పెద్ద వాగు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో ఆందోళన
చేర్యాల నేటిధాత్రి…
ఆకునూరు గ్రామానికి ఇసుక రవాణను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆకునూర్ పెద్ద వాగు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గ్రామంలోని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. చేర్యాల మండలంలోని ఆకునూరు పెద్ద వాగులో ఇసుకను గ్రామ ప్రజల అవసరాల కోసం పూర్వ కాలం నుండి ఇంటి నిర్మాణం, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అవసరాల కోసం నాటినుండి నేటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకుంటున్నామని, కానీ ఇటీవల అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారన్న నెపంతో ఓ ట్రాక్టర్ ను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని కేసులు పెట్టి ఇసుక రవాణాను నిలిపివేయడంతో గ్రామంలో చేపడుతున్న నూతన ఇంటి నిర్మాణ పనులు, దేవాలయాల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామ వాగు ఇసుక తమకు చెందకుండా అధికారులు షరతులు విధించి ఇబ్బందులకు గురి చేయడం సబాబు కాదన్నారు. ఇప్పటికైనా గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు స్పందించి గ్రామానికి ఇసుక రవాణా ఎప్పటిలాగే యధావిధిగా కొనసాగించే విధంగా అధికారులు అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్ కార్యాలయంను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఆకునూరు పెద్ద వాగు పరిరక్షణ కమిటీ నాయకులు బోయిని బాలయ్య, పుల్లని వేణు, అందే నాని బాబు, కడారి నరేష్, కన్నబోయిన శ్రీనివాస్, కోయినేని నర్సయ్య, ఎర్ర అశోక్, కడారి పరశురాములు, శెట్టే మల్లయ్య, కడారి బాలయ్య, చిగుళ్ల పోచయ్య, కడారి నరేష్, కడారి రాజు, మాద పరుశరాములు, అమరగొండ నర్సింహులు, అమరగొండ మల్లేశం, తోకల వెంకటేష్, కోయినేని శ్రీనివాస్, ఎండీ. అక్బర్, తోట శ్రీనివాస్, సూర్ణ సాయిలు, మాధ ఐలయ్య, అమరగొండ అయ్యల్లం, సిరిగిరి రాజు, గోనెపల్లి మల్లేశం, సుంకరి బాబురాజు, తోట శ్రీనివాస్, తాటికొండ రాజయ్య, కడారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం తహసిల్దార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది.