# రాష్ట్ర చిహ్నంలో వరంగల్ కళాతోరణం తొలగిస్తే మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తాం.
# వరంగల్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న రేవంత్..
# ఉద్యమంలో అమరులను బలిగొన్నది కాంగ్రెస్ పార్టీనే..
# మాజీ ఎమ్మెల్యే,మాజీ సివిల్ సప్లై చైర్మన్,మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి.
# మలిదశ ఉద్యమకారులకు ఘనంగా సన్మానం.
# పార్టీ జెండా ఆవిష్కరించిన బిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి.
వరంగల్ జిల్లా ప్రతినిధి/ నర్సంపేట,నేటిధాత్రి :
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఆ ఉద్యమాన్ని తుపాకీ ఎక్కుపెట్టి అడ్డుకున్న ఉద్యమ ద్రోహి అనుముల రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం అని రాష్ట్ర మాజీ సివిల్ సప్లై చైర్మన్,మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలలో” భాగంగా హన్మకొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు, బిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి గులాబీ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ 1969 సంవత్సరం తొలిదశ,అలాగే మలిదశలో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఎంతో మందిని అమరులను బలిగొన్నది నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా రాష్ట్ర చిహ్నాలు మారుస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.వరంగల్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ రాష్ట్ర చిహ్నంలో వరంగల్ కళాతోరణం తొలగిస్తే వరంగల్ నుండే మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరోసారి హెచ్చరిస్తున్నట్లు బిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ సహచరులకు తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం 1969 నాటి తొలిదశ ఉద్యమకారులను శాలువాలు,పూలదండలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్,మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ,వరంగల్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ,వరంగల్,హన్మకొండ జిల్లాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు,గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.