Training Program Launched for Newly Elected Ward Members in Jaipur
వార్డ్ సభ్యులకు ప్రారంభమైన శిక్షణ తరగతులు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని రైతు వేదిక ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులకు శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు.సోమవారం టిఓటి ల ద్వారా గ్రామ పంచాయతీ పరిపాలన,స్థానిక సంస్థల బాధ్యతలు,అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానం,ఆర్థిక నిర్వహణ, పాలన పారదర్శకత,గ్రామ సభల నిర్వహణ,శానిటేషన్,ప్రభుత్వ పథకాల అమలు వంటి వివిధ అంశాలపై వార్డ్ సభ్యులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడం జరిగింది.మొదటి విడతగా ఫిబ్రవరి 23 నుండి ఫిబ్రవరి 27 వరకు 10 గ్రామ పంచాయతీల వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.రెండవ విడతగా మార్చి 4 నుండి మార్చి మూడవ తేదీ వరకు మరో 10 గ్రామ పంచాయతీల వార్డ్ సభ్యులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు హాజరై,నూతనంగా ఎన్నికైన వార్డ్ సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు.ప్రజలతో సమన్వయం,పారదర్శకత,బాధ్యతాయుత పరిపాలన అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,మండల తహసీల్దార్ వనజా రెడ్డి,మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు,సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి,టిఓటి లు సురేశ్,రమేష్,దేవేందర్,సురేశ్ లు,పంచాయతీ కార్యదర్శులు,మండలంలోని వివిధ గ్రామాల వార్డ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
