అడ్డంగా వేసిన పందిళ్లను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది
పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మెయిన్ రోడ్ వెల్లంపల్లి రోడ్,హన్మకొండ రోడ్, భూపాలపల్లి రోడ్ హుజురాబాద్ రోడ్ లోని వ్యాపారస్తులకు,చిరు వ్యాపారులకు అందరికీ రోడ్ బౌండరీలో అనధికారికంగా వేసిన రేకుల షెడ్లు,పందిర్లు, బోర్డులు మరియు సామాన్లు పెట్టడం వలన వాహనదారులకు,షాప్ లోకి వచ్చే కస్టమర్లకు ఇబ్బంది కలుగుతు రోడ్డు ప్రమాదాలు జరుగుచున్నవని ఫిర్యాదులు వస్తున్నాయని తెలియచేసినప్పటికి ఎవ్వరు స్పందించకపోయినప్పటికి శుక్రవారం రోజున ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ముందు కొన్ని షాపూల ముందు వేసిన రేకులను పందిర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించినారు. మిగతా షాపుల వారు,చిరు వ్యాపారస్తులు అందరూ రెండు రోజులలో షాప్ ల ముందు వేసిన రేకులు,పందిర్లు మరియు సామాను స్వచ్చందంగా తొలగించుకొని రోడ్డు ప్రమాదాలు జరగకుండా మరియు కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా సహకరించగలరు.లేని సందర్బంలో మున్సిపల్ సిబ్బందిచే వాటిని తొలగించి, పెనాల్టీ విధించబడునని కావున పట్టణ వ్యాపారస్తులు సహకరించాలని మున్సిపల్ సిబ్బంది కోరడం జరిగింది.