
ఎమ్మెల్యే బండారి
కాప్రా నేటి ధాత్రి మార్చ్: 28
చర్లపల్లి డివిజన్లలో కాలనీలోని సమస్యలపై విస్తృత పర్యటన చేసిన ఉప్పల్
ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి
చర్లపల్లి డివిజన్ చక్రిపురం ,టీచర్స్ కాలనీ ,సీతారాం కాలనీ,మారుతి కాలనీ ,గాంధీ నగర్ , సోనియా గాంధీ నగర్ ఫేస్ 2 కాలనీ లలో ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి ,కాలనీ వాసులు ,ప్రెసిడెంట్లతో కలిసి పర్యటించారు.
స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో కొన్ని చోట్ల డ్రైనేజీలు సమస్య , ప్రధానంగా మంచినీటి పైప్ లైన్ సమస్యలను గుర్తించి ,అలాగే సీసీ రోడ్ ఎర్పాటు చేయలని కాలనీ వాసులు కొరగా
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కార మార్గాన్ని చూపుతామని
నియోజకవర్గ పరిధిలోని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారమందిస్తామని
సంబందిత అధికారులతో మాట్లాడి ఈ సమస్యలను తప్పక నెరవేరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకుడు మహేష్ గౌడ్ , డివిజన్ అధ్యక్షులు డప్పు గిరిబాబు ,చక్రిపురం కాలనీ ప్రెసిడెంట్ రాఘవ రెడ్డి , బుచ్చిరెడ్డి ,టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి,
సీతారామ్ కాలనీ ప్రెసిడెంట్ ఆశోక్ ముదిరాజ్ ,గాంధీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీశైలం ,మారుతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్ ,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.