వరంగల్,నేటిధాత్రి :
తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 27న అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ వరంగల్-1 డిపో ఏర్పాటు చేసినట్లు రీజినల్ మేనేజర్ జె శ్రీలత తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వీసు నంబర్ 92222 గల సూపర్ లగ్జరీ బస్సు నవంబర్ 25 న రాత్రి 10 గంటలకు హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నవంబర్ 26 వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనం, మధ్యాహ్నం వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం. అనంతరం రాత్రి అరుణాచలం చేరుకుంటుందన్నారు.అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత తేదీ నవంబర్ 27న అరుణాచలం నుంచి మధ్యాహ్నము బయలుదేరి నవంబర్ 28 తేదీ ఉదయం శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం సన్నిధి కి వెళ్తుందని అక్కడ దర్శనానంతరం హన్మకొండకు చేరుకుంటుందని తెలిపారు.అరుణాచల గిరి ప్రదర్శనను టూర్ ధరను ఒక్కొక్కరికి రూ.4500 గా టీఎస్ఆర్టీసీ నిర్ణయించిందని అన్ని సెస్ చార్జీలు, టోల్ టాక్సులు కలుపుకొని టూర్ ప్యాకేజీగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణ కు భక్తుల రద్దీ దృష్ట్యా హన్మకొండ బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును టీఎస్ఆర్టీసీ వరంగల్-1 డిపో ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు వినియోగించుకోవాలని కోరారు. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని అలాగే వరంగల్, హనుమకొండ, కాజీపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ దగ్గరలోని బస్టాండ్ తో పాటు సమీప టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చని ఈ టూర్ ప్యాకేజీకి సంబందించిన పూర్తి సమాచారం కోసం 9959226047, 7382855492 ఫోన్ నంబర్లను సంప్రదించగలని రీజినల్ మేనేజర్ జె శ్రీలత తెలిపారు.
టీఎస్ఆర్టీసీ అధ్వర్యంలో అరుణాచల గిరి సందర్శనానికి టూర్
