
“Youth Urged to Uphold Ambedkar’s Ideals”
బుద్దుడి చూపిన అంబేద్కర్ ఆశయాలను నేటి యువత సాధించాలి.
చిట్యాల, నేటి ధాత్రి:
చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ ఆద్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భౌద్ధమతం స్వీకరించిన రోజును పురస్కరించుకుని ముందుగా గౌతమ బుద్ధుడి చిత్రపటానికి పూలు వేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య* విచ్చేసి మాట్లాడుతూ .. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు హిందువుగా పుట్టి హిందువుగా మరణించనని భారత దేశంలో ఉన్న అన్ని మతాల గురించి తెలుసుకొని చివరకు గౌతమ బుద్ధుడి బోధనలు సూక్తులు సిద్ధాంతాలు నచ్చి బౌద్ధమతాన్ని 14 ఆక్టోబర్ 1956న 5లక్షల మందితో మహారాష్ట్రలోని నాగపూర్ లో బౌద్ధ మతాన్ని స్వీకరించాడని తెలిపారు. నేటితో ఆది 69 సంవత్సరాలు అన్నారు . ఈ ఆధునిక ప్రపంచానికి సరిపోయేది భౌద్ధ మతమే అని , ఈ ప్రపంచాన్ని రక్షించ గల శక్తి ఓక భౌద్ధ మతానికి మాత్రమె ఆన్నారు. మానవతా విలువల వైపు నడిపించేధి భౌద్ధం మాత్రమే అని బోధిసత్వ డా బి ఆర్ అంబేద్కర్ గారు తెలిపారని అని చెప్పారు. ఈ ప్రపంచంలో గౌతమా బుద్ధుడు పుట్టిన తర్వాత మానవ పరివర్తన కోసం మొట్ట మొదటి సారిగా ప్రెమ దయ జాలి ఆకరుణ దానం శీలం ప్రజ్ఞ సమత వంటి గొప్ప సిద్ధాంతమే కాక మైత్రి ధ్యానం మానవ కళ్యాణం కోసం త్రిచరణములను పంచ శిలాలను ఆస్టాంగా మార్గాలను 11 పారమిధులను 24 మానవ జీవన సూత్రాలను మనషి పకృతి జీవనాధారంలో బుధుడు కనుక్కొని ఇతరులకు వర్తించే విధంగా శ్వాసపైనా ధ్యాస మనసు శరీరానికి ఉన్న సమతా భావాలు సామాజిక శాస్త్ర విజ్ఞానము జ్ఞానంతో. భారత దేశం దేశంలో బుధుడు 45 సంవత్సరాల పాటు కాలి నడకన ప్రయాణిస్తూ తాను దమ్మ జ్ఞానాన్ని ప్రజలకు బోధించాడని అన్నారు. బుధుడు చూపిన మార్గంలో నడుస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించుటకు నేటి యువతీ యువకులు ముందుకు రావాలన్నారు*
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గడ్డం సదానందం కట్కూరి మొగిలి చందర్ మొగిలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.