Sammakka–Saralamma Vanapravesham Today
నేడే తల్లుల వన ప్రవేశం
మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. బుధవారం నుంచి నాలుగురోజులపాటు జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. శనివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించే ప్రత్యేక పూజలతో సమ్మక్క-సారలమ్మలనే తిరిగి వన ప్రవేశం చేస్తారు.
ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!
సమ్మక్క గద్దెపైకి ఈ పూజారులు మాత్రమే వెళ్లి వనప్రవేశానికి సంబంధిం చిన ఆదివాసీ సంప్రదాయ తంతును ము గిస్తారు. ఆ తర్వాత తల్లి రూపమైన కుంకుమ భరిణను తీసుకొని బయలుదేరుతారు. చిలుకలగుట్టపైకి తీసుకువెళ్లి అక్కడ ఆమె నిజస్థానంలో ఉంచి వెనుదిరు గుతారు. మళ్లీ రెండేళ్లకు వస్తాం తల్లీ.. అంటూ సెలవు తీసుకుంటారు. అలాగే శనివారం రోజే సమ్మక్కతో పాటు సారలమ్మను, గోవిందరాజులును, పగిడిద్దరాజు కూడా వనప్రవేశం చేస్తారు. సారలమ్మను కన్నెపల్లి(Kannepalli)లోని ఆమె గుడికి, పగిడిద్దరాజును పూనుగుండ్లకు, గోవిందరాజులను కొండా యిలోని వారి నిజస్థానాల్లోకి తిరిగి చేరు స్తారు. అక్కడ పూజల అనంతరం వెనుదిరుగుతారు.కాగా, శనివారం సాయంత్రం వనప్రవే శం జరిగే వరకు, ఆ తర్వాత మరో రెండు మూడు రోజుల వరకు భక్తులు మొక్కు లను సమర్పించడం నిరంతరాయంగా కొనసాగుతుంది. శనివారం వనప్రవేశానికి ముందు మధ్యాహ్నం తర్వాత గద్దెలపై ఉన్న బెల్లం, బియ్యాన్ని తొలగించి గద్దెలను శుద్ధి చేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులను గద్ద్దెలపైకి తీసుకువచ్చే సమయంలో నిర్వహించిన పూజాతంతునే వనప్రవేశం సందర్భంగా కూడా తిరిగి నిర్వహిస్తారు.
