జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో పనిచేసి మంగళవారం రోజు పదవీ విరమణ పొందుతున్న నలుగురు ఉద్యోగులను జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీఎస్ సన్మానించారు.
ఎస్ఐ, రెహమాన్, 1983 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 41 సంవత్సరాల సర్విస్, వి.వేణు, ఏ ఎస్ ఐ 1984 లో బ్యాచ్ కానిస్టేబుల్ గా ఎంపికై 40 సంవత్సరాల సర్విస్, నగేష్ నాథ్, ఏ ఎస్ ఐ 1989 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 35 సంవత్సరాల సర్వీస్, నారాయణ రెడ్డి, హెచ్ సి,1991 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికై 33 సంవత్సరాల సర్వీస్ పోలీసు శాఖ లో అమూల్యమైన సేవలు అందించి ఈరోజు పదవి విరమణ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పదవీ విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని, ఉద్యోగంలో ఉన్నపుడు చేసిన సేవలే ఉద్యోగణాంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తాయని, పదవి విరమణ పొందుతున్న నలుగురు ఉద్యోగులను పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా, హెడ్ కానిస్టేబుల్ గా, ఏ.ఎస్.ఐగా, ఎస్.ఐగా పదోన్నతి పొంది సుధీర్ఘకాలంగా విధులు నిర్వహించడం మరువమని, పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వర్తించి, ప్రజా రక్షణ కోసం వీరు పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని ఎస్పీ అన్నారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి డ్యూటీలు చేసినారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మీకు ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రాములు, డి.సి.ఆర్.బి డి.ఎస్.పి రమణారెడ్డి, ఏవో రుక్మిణి భాయ్, ఎస్.పి సిసి రామ్ రెడ్డి మరియు జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.