మంత్రి జూపల్లి కృష్ణారావు.
గోపాల్ దిన్నె జలాశయాన్ని సందర్శించిన మంత్రి జూపల్లి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె జలాశయాన్ని మంత్రి జూపల్లి సందర్శించారు. జలాశయ నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చుక్క నీరు కూడా వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని, వీపనగండ్ల, చిన్నంబావి, పాన్ గల్ మండలాల్లోని సుమారు 40 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సురక్షితమైన నీటిని ప్రజలకు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేసి వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.