*తిరుపతి జిల్లాకు ఎరువుల సరఫరా పెంపు అవసరం..
*ఎంపీ మద్దిల గురుమూర్తి..
తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 27:
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి 2025-26 ఖరీఫ్ మరియు రబీ సీజన్‌ల కోసం అవసరమైన ఎరువుల సరఫరా పెంచేందుకు తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సి.ఐ.ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌లకు లేఖ రాశారు.
2024-25 వ్యవసాయ సంవత్సరంలో 1,19,141,
మెట్రిక్ టన్నుల ఎరువులు వినియోగించబడ్డాయని తెలిపారు.రైతుల అవసరాలను, పెరుగుతున్న వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2025-26 సంవత్సరానికి 25% పెరుగుదల అంటే 1,54,131 మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా అవసరమని తన లేఖలో పేర్కొన్నారు.
రైతులకు ఎరువులు సకాలంలో అందించేందుకు, జిల్లాలో రిటైల్ డీలర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం 258 ప్రైవేట్ డీలర్లు, 36 వ్యవసాయ సహకార సంఘాలు ఎరువుల పంపిణీలో ఉన్నాయని, పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా డీలర్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు.
రైతుల ఉత్పాదకత పెంపు, ఆహార భద్రత లక్ష్యాలను సాధించేందుకు సరఫరా పెంపు ఎంతో కీలకమని ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తగిన చర్యలు తీసుకుని, అవసరమైన ఎరువుల నిల్వలు సమర్థవంతంగా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.