నారింజ డ్యామ్లో ముగ్గురి ఆత్మహత్యాయత్నం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజ ప్రాజెక్టు వద్ద, ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి డ్యామ్లో దూకింది. స్థానికుల సమాచారం మేరకు జహీరాబాద్ రూరల్ పోలీసులు వెంటనే స్పందించి, శివరాజ్, మోహన్ నాయక్ లతో కూడిన బృందం అక్కడికి చేరుకుంది. అమలాపురం నాగరణి, ఆమె పిల్లలు దీపక్ రెడ్డి, అక్షరలతో మాట్లాడి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఐ కాశీనాథ్ వారితో మాట్లాడగా, భర్తతో మనస్పర్ధల కారణంగా ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. వారికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
