
కరీంనగర్, నేటిధాత్రి:
ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరుగు వెయ్యి గొంతులు లక్ష డప్పుల మాదిగల గుండెచప్పుడు ప్రదర్శనను విజయవంతం చేయడానికికై ప్రారంభమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారుల రథయాత్ర నేడు ఐదవ రోజు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చేరుకుంది.ఈసందర్బంగా కళామండలి రథయాత్ర రాష్ట్ర కోర్దినేటర్ రామంచ భరత్ మాదిగ హాజరై మాట్లాడుతూ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ న్యాయమైందని రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలు వారి జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ అమలు చేయాల్సిందిగా తీర్పు ఇచ్చిందని, ఈనెల20న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంద కృష్ణ మాదిగ వస్తున్నారని ఫిబ్రవరి7 హైదరాబాద్ నడిబొడ్డున వేల గొంతులు లక్ష డప్పులు కళాకారులతో మాదిగల గుండె చప్పుడు వినిపించబోతున్నారూ అందుకోసం వెయ్యి గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికో డప్పును సంకన వేసుకొని రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో బెజ్జంకి అనిల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రాజన్న మాదిగ, ఎమ్మేస్పి జిల్లా ఉపాధ్యక్షులు తడగొండ శంకర్ మాదిగ, ఎమ్మేస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి దోమకొండ శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు శనిగరపు హన్మయ్య మాదిగ, గంగాధర రవి మాదిగ, సిపెళ్లి నరేష్ మాదిగ, గుంటుకు వినయ్ మాదిగ, కోలేపాక మల్లేశం మాదిగ, శనిగరపు మల్లయ్య మాదిగ, తదితరులు పాల్గొన్నారు