ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలంలోని లక్కారం గ్రామంలో గురువారం విడుదలైన పోలిస్ ఉద్యోగాలు సాదించిన యువకులనుముత్తారం మండలం మాజీ ఎంపీపీ రైతుబందు మండల అద్యక్షుడు అత్తే చంద్రమౌలి అద్వర్యంలో పంచాయితి పాలక వర్గం ఘనంగా సన్మానించారు. లక్కారం గ్రామానికి చేందిన దయ్యాల సంతోష్ ఏఅర్ కానిస్టేబుల్,భూడిద సాగర్ జైల్ కానిస్టేబుల్,మంథని అఖీల్ ఆర్మీలో సెలెక్ట్ అయి ట్రైనింగ్ పూర్తీ చేసుకోని జమ్ము కాశ్మీర్ కు విధులు నిర్వహించడానికి వెళ్తున్న అతని షాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రంలో సర్పంచ్ అత్తే లళిత,ఎంపీటీసీ ఒద్ది తిరుమల తిరుపతి,ఉప సర్పంచ్ జంగ తిరుపతి రెడ్డి,వార్డు సబ్యులు స్వరూప సారయ్య, నరేష్,అయిలమ్మ పోశాలు,గ్రామ శాఖ అద్యక్షుడు మాదసి రమేష్, రైతు బందు గ్రామ శాఖ అద్యక్షుడు బర్ల కుమార్, కాసు సదానందం, బూడిద ప్రసాద్,మదునయ్య, శంకర్,తదితరులు పాల్గొన్నారు.