తిమ్మాపూర్‌లో పడకేసిన పారిశుద్ధ్యం
వరంగల్ గ్రేటర్ మహానగరంలోని ఆరో డివిజన్ తిమ్మాపూర్ పేరుకే మహానగరంగా పిలువబడుతోంది. తిమ్మాపూర్‌లో పారిశుద్ధ్యం పడకేసింది. డ్రైనేజీల్లో ఎక్కడికి అక్కడ మురుగునీరు నిలిచి కంపు కొడుతున్నాయి. కాలనీలలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో విలీనమై ఏళ్లు గడుస్తున్నా స్థానిక కార్పొరేటర్, స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్, మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని తిమ్మాపూర్‌వాసులు వేడుకుంటున్నారు.