Headlines

రా..ప్రజల కోసం కదలి రా!!

https://epaper.netidhatri.com/

`సుభాష్‌ రెడ్డి ప్రజాసేవ కోసం జనం ఎదురుచూపులు.

`గత రెండు దశాబ్దాలుగా ప్రజలు కోరుతునే వున్నారు.

`రాజకీయాలకతీతంగా అనేక సేవా కార్యక్రమాలు.

`కామారెడ్డిలో వెలుగులు నింపాడు.

`సొంత ఊరికి ఎంతో చేశాడు.

`ఆపదలో వున్నవారెందరికో అండగా నిలిచాడు.

`ఎంతో మందికి ప్రాణదాతయ్యాడు.

`తెలంగాణలో అనేక ప్రాంతలలో ఆయన సాయం కనిపిస్తుంది.

`అభివృద్ధిలో ఆయన చేయూత వుంటుంది.

`పేదలంటే ప్రాణం..వారి కోసం ఎంతో త్యాగం.

`మానవత్వం నిండిన గొప్ప రూపం.

`వ్యక్తిగత సాయాలకే చేతికి ఎముక లేదు.

`రాజకీయాలలో చేరితే ఆయన సేవకు తిరుగుండదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

అభివృద్దికి అడుగులు నేర్పగల సమర్ధుడు. ప్రగతినే పరుగులు పెట్టించగల కార్యోన్ముకుడు. మంచి తనానికి రూపం కల్పిస్తే కనిపించే వ్యక్తి. కామారెడ్డి లాంటి కరువు ప్రాంతాల ప్రజలకు మేలు చేసే మంచి మనిషి. అపురూపం ఆయన ఆత్మీయం. అందిరికీ ఆరాధ్యం ఆయన వ్యక్తిత్వం. కామారెడ్డి జిల్లా కోసమే ఆయన జీవితం. వారి గుండెల్లో సుస్ధిర స్దానం కోసమే ఆయన మానవీయ ప్రయాణం. ఇప్పటికే జనంగుండెల్లో నిండిన నిండైన రూపం. అందరి మదిలో పదిలమైన ఆయన యశస్సు కీర్తి శిఖరం. ఆయన అడుగులు మార్గదర్శనం. రేపటి తరానికి ఆచరణీయం. ఆయన అడుగు జాడలు యువతకు ఆదర్శం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మానవత్వానికే నిలువెత్తు రూపం. మంచితానికి నిజరూపం. ప్రజల కోసం ఆలోచించే తత్వం, జనం కోసం, జనహితమే ఆయన ఆలోచనా మార్గం. ఆయన ఆత్మీయత ఎంతో గొప్పది. ఆయన అభిమానం కొండంత అపురూపమైంది. ఆపదలో వున్న వారికి కోసం ఆయన కదలాడే మానవత్వం. నమ్ముకున్నవారికి దైవసమానం. ఆయన ఎవరో కాదు సుభాష్‌రెడ్డి. ఈ పేరు వింటనే కామారెడ్డి ప్రాంతం పులకరించిపోతుంది. ఆ ప్రాంతంలో ఆయన పేరు మారు మ్రోగిపోతుంది.
ప్రతి వ్యక్తి జీవితంలో ఎందరో తారసపడుతుంటారు.
కాని కొన్ని వేల మంది జీవితాలను ప్రభావితం చేసేవారు నిత్యం మన కళ్లముందు వుంటే ఎలా వుంటారు. అది సుభాష్‌రెడ్డిలగా వుంటారు. కామారెడ్డి జిల్లా ప్రజల మీద సుభాష్‌రెడ్డి బలమైన ముద్ర వేసుకున్నారు. ఆయన వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే. వారి హితం కోసమే. ప్రజల మేలు కోసం. వారి జీవితాలలో మార్పుకోసం. అదే సుభాష్‌రెడ్డి ధ్యేయం. పేదల జీవితాలలో వెలుగు నింపడమే ఆయన లక్ష్యం. ఆయన పిలిచే చల్లని పిలుపే ప్రజలను ఆయన దగ్గరుచేస్తాయి. మంచితనమే సుభాష్‌రెడ్డి బలం. జనమే ఆయన వెన్నంటుండి నడిచే బలగం. జనం కోసం ఎంతైనా చేస్తాడు. జనం మంచే ప్రతి క్షణం కోరుకుంటాడు. అన్నా అని సాయం కోరితే తాను కొండంత అండగా నిలబడతాడు. వెయ్యేనుగుల బలాన్ని ఇస్తాడు. ఆపదలో ఆదుకుంటాడు. వారిని ఆదరిస్తాడు. ఇలా వ్యక్తిగత సాయం కోసం వచ్చే వారికోసమే కాదు…తన కన్న ఊరును గొప్పగా తీర్చిదిద్దాడు. మరో వెయ్యేళ్లయినా ఆ ఊరి జనం సుభాష్‌రెడ్డిని మర్చిపోకుండా అభివృద్ది చేశాడు. ఈ రోజుల్లో అన్నదమ్ములే సరిగ్గా కలిసి వుండడం లేదు. తోటి వారికి సాయం చేసేందుకు చేతులు రావు. రక్తం పంచుకుపుట్టిన వారిని కూడా పైస దూరం చేస్తుంది. సాటివారిని ఆదుకోవాంటే ఒకటికి పది సార్లు ఆలోచించేవారే ఈ సమాజంలో 99శాతం మంది. కాని తనకు తెలిసినా, తెలియకపోయినా, ఆపదలో వున్నవారెవరైనా సరే సుభాష్‌రెడ్డికి విషయం తెలిస్తే చాలు ఎంతటి సాయమైనా చేస్తారు. వారి జీవితాలను నిలబెడతారు. వారి కాష్టాలు తీరుస్తుంటాడు. అలాంటిది ఊరుకే కష్టం వస్తే ఊరుకుంటాడా? ఊరును సుందర వనం చేశాడు. సుందరమైన ప్రదేశంగా తీర్చిదిద్దాడు. ఊరిలో సరైన గూడు లేని వారి జీవితాలకు కోవెల లాంటి గూడులు నిర్మించి ఇచ్చాడు. ఇదీ సుభాష్‌రెడ్డి అంటే..ఇదీ ఆయన దాతృత్వం అంటే..
జనం కష్టాలు తెలుసుకుంటేను మనుషులుగా గుర్తింపు పొందుతారు.
జనం కష్టం తీర్చేవారు మానవత్వం వున్న నాయకులుగా గుర్తింపు పొందుతారు. ప్రజలనుకష్టాలనుంచి బైట పడేస్తారు. అలాంటి వారందరిలో సుబాష్‌రెడ్డి ముందుంటారు. తనకు తెలిసిన వారు ఎవరికైనా ఆర్ధికపరమైన సమస్యైనా, ఆరోగ్యపరమైన సమస్య అయినా సరే తీర్చుతాడు. అదే సుభాష్‌రెడ్డి గొప్పదం. అందుకే ఆయన కామారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రజలు రా..ప్రజల కోసం..కదలి రా!! అంటూ సుభాష్‌రెడ్డిని పిలుస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న మా సుభాష్‌రెడ్డి మా నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒకరోజు, రెండు రోజులు, మహా అయితే ఓ ఏడాది పాటు చిన్న చిన్న సాయాలు చేస్తుంటారు. కాని సుభాష్‌ రెడ్డి చేసే సాయాలు చిన్నవి కాదు. అవసరమైతే కోట్ల రూపాయలకు కూడా వెనుకాడకుండా సాయం అందించే గొప్ప గుణం సుభాష్‌రెడ్డి సొంతం. ఒక వ్యక్తిగానే ఇంత సేవ చేస్తున్న సుభాష్‌రెడ్డి తమ ప్రజా ప్రతినిధి అయితే తమ జీవితాలు మరింత వృ ద్ధిలోకి వస్తాయనుకుంటున్నారు. సుభాష్‌రెడ్డి రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తుంటారు. తెలంగాణలోని ఏ మారు మూల ప్రాంతం నుంచైనా సరే ఎవరు వచ్చినా ఆదరిస్తాడు. ఆయన సాయం చేసిన గ్రామాలు తెలంగాణలో అనేక పల్లెలున్నాయి. అలా అనేక మంది ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలలో సమస్యల పరిష్కారానికి సుభాష్‌రెడ్డి సాయం కోరుతుండేవారు. ఏ నాయకుడు వచ్చి మా ఊరికి సాయం చేయమంటే చేస్తుంటాడు. అలా తెలంగాణలోని అనేక గ్రామాలలో కొన్ని లక్షల రూపాయలు వితరణ చేసి, గ్రామాలలో అనేక అభివృ ద్ధి కార్యక్రమాలు సొంత నిదులతో చేసిన మానవతామూర్తి సుభాష్‌రెడ్డి. అందుకే ఆయనంటే అన్ని పార్టీలకు ఇష్టం. ఆయనంటే అన్ని పార్టీల నాయకులకు సాన్నిహిత్యం. ఒక రకంగా చెప్పాలంటే సుభాష్‌రెడ్డి అజాతశత్రువు. ఏ పార్టీ వాళ్లయినా సరే ఆయనుకు ఆత్మీయులే. తన సొంత జిల్లా అయిన కామారెడ్డిలో సుభాష్‌రెడ్డి అనేక అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారు. వాటన్నింటినీ చెప్పాలంటే ఒక గ్రంధమే రాయాలి. చెరువుల తవ్వించడం నుంచి మొదలు అనేక పనులు ప్రజల కోసం చేశారు. కామారెడ్డి వెలుగుల్లో సుభాష్‌రెడ్డి చూపిన చొరవ అంతా ఇంతా కాదు.
సహజంగా ఎవరైనా తాను సంపాదించే దానిలో ఓ పైసా పక్కన పెట్టి సాయం చేస్తుంటారు.
కాని సుభాష్‌రెడ్డి ఆ పైస కూడా తన వద్ద వుంచుకోకుండా తన సంపాదనంతా జనం కోసమే వినియోగిస్తుంటాడు. ప్రజలకు సేవ చేయడంలో ముందూ వెనకు ఆలోచించడం అన్నది ఏనాడు చేయడు. అందుకే ఆయన జనం గుండెల్లో నిండిపోయాడు. తన సొంత ఊరుకు ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఊరి తలరాతే మార్చేశాడు. ప్రభుత్వం కూడా అటువంటి ప్రభుత్వ బడి కట్టించలేదు. కార్పోరేట్‌ సంస్ధలు నిర్మించే స్కూల్‌ కూడా అంత గొప్పగా వుండదు. లక్షల రూపాయల ఫీజలు వసూలు చేసే స్కూళ్లలో కూడ అన్ని సౌకర్యాలు వుండవు. ఆయన నిర్మించిన స్కూళ్లలో అన్ని వసతులుంటాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నిర్మించలేనంత గొప్పగా తన సొంత నిధులు చేర్చి, ప్రజలకు అద్భుతమైన ఇళ్లు విల్లాలను తలపించేలా నిర్మాణం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం వున్నాయి. అలా ఊరిని, తన మండల, జిల్లాను అభివృద్ది చేసిన సుబాష్‌రెడ్డి రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు. అవసరమైతే పార్టీలకు అతీతంగానైనా రాజకీయాల్లోకి వచ్చి, ప్రజా ప్రతినిధి కావాలని కోరుకుంటున్నారు. గతంలో ఎన్నీఆర్‌ను ప్రజలే రా..రమ్మని పిలిచినట్లు, ఆ తర్వాత మళ్లీ సుభాష్‌రెడ్డినే తెలంగాణలో ప్రజలు రా..రమ్మని పిలవడం ఆశ్చర్యకరం. ఎందుకంటే తమను ఎంతో ప్రేమించే సుభాష్‌రెడ్డి తనకు ప్రజా ప్రతినిధి అయితే తాము సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే తమకు ఏం కావాలో సుభాష్‌రెడ్డికి తెలుసు. తమ ప్రాంతానికి ఏమి అవసరమో ఆయనకు మాత్రమే తెలుసు. అందువల్ల చేతికి ఎముక లేదన్నట్లుగా సేవ చేస్తే, సుభాష్‌రెడ్ది మా జీవితాలకు మరింత మేలు చేస్తారన్న నమ్మకం ఆ ప్రజల్లో బలంగా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *