
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల గ్రామంలో రాత్రి 10 దాటితే చాలు దొంగలు హల్చల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే యన్మన్ గండ్ల గ్రామపంచాయతీ శివారులోని 340/341 సర్వే నెంబర్లలో యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన రైతు కోస్గి వెంకటయ్య వారి ముగ్గురి అన్నదమ్ములు కలిసి గత నెల రోజుల కిందట కొత్తగా బోరు వేసి భూమి చదునుచేసి వరి నాటువేసుకున్నారు. ప్రతిరోజు వెంకటయ్య ఉదయం సాయంత్రం పొలం దగ్గరకు వెళ్లి వచ్చేవారు. బుధవారం రోజు వెంకటయ్య తన సొంత పనులకై మహబూబ్ నగర్ పట్టణానికి వెళ్లారు. అది అదునుగా భావించిన గుర్తుతెలియని దొంగలు బోరు స్టార్టర్ ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం వెంకటయ్య వెళ్లి చూడగా బోరు నడవకపోవడంతో డబ్బా దగ్గరికి వెళ్లి చూడగా తన యొక్క స్టార్టర్ అపహరణకు గురైందని తోటి గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తుల సహకారంతో ఇట్టి విషయంపై నవాబుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్యను విచారణ కోరగా రాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇట్టి విషయంపై విచారణ జరిపిస్తామని పోలీసు వారు తెలిపారు.