#నెక్కొండ, నేటి ధాత్రి:
వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘంలో నెక్కొండ మండలం నుండి ముగ్గురికి చోటు కల్పించిన జిల్లా ఆర్యవైశ్య సంఘం. ముగ్గురిలో మారం రాము , గోరంటల వెంకటనారాయణ,దేసు లక్ష్మణ్ ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీలో అవకాశం కల్పించిన జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు వంగేటి అశోక్ ,గంధ శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముగ్గురు ఈనెల ఆరో తారీకు ఆదివారం ఉదయం 11 గంటలకు వరంగల్ జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్ లోగల గోల్డెన్ గార్డెన్స్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు జిల్లా కమిటీ నుండి విరికి ఆదేశాలు అందినాయి. ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం మా వంతుగా కృషి చేస్తామని మారం రాము, గోరంట్ల వెంకటనారాయణ, దేసు లక్ష్మణ్ లు అన్నారు.