
ఏదైనా కూడలిలో ఏర్పాటు చేయాలనీ బీజేపీ నాయకుల డిమాండ్
పరకాల నేటిధాత్రి
మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరకాల కూడలిలో ఏర్పాటు చేయాలని పరకాల బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా మార్త బిక్షపతి మాట్లాడుతూ దేశం కోసం కృషి చేసి ప్రపంచమే గుర్తించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గత పాలకుల అలసత్వంతో పరకాలలో లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు ముందుకు రావడం స్వాతిస్తున్నామని కానీ ఆ విగ్రహాన్ని ఏదో మూలన ఏర్పాటు చేయకుండా కూడలిలో ఏర్పాటు చేసి ఆ కూడలికి గాంధీ చౌక్ గా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘనాథ్,తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బాసాని సోమరాజు, భూపాలపల్లి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు సయ్యద్ గాలిప్, పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్,ఉపాధ్యక్షులు మిడిదొడ్డి నరేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య,సీనియర్ నాయకులు పావుశెట్టి శ్రీనివాస్,మహిళా మోర్చా అధ్యక్షురాలు వెలిశెట్టి శారద తదితరులు పాల్గొన్నారు.