
రామడుగు, నేటిధాత్రి:
నేటి ఆధునిక ప్రపంచంలో క్రియేటివిటీ ఉంటేనే లైఫ్ అని ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ ఇంటర్ స్కూల్ కాంపిటేషన్ లో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన సరస్వతి ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు పాల్గొని సత్తాచాటారు. ఈసందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో పాల్గోని మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకతను వెలికితీసేందుకు అబాకస్, వేదిక మ్యాథ్స్ దోహదం చేస్తాయన్నారు. జూనియర్స్ లెవల్1లో రాచమల్ల నవనీత ఉమ్మడి జిల్లా టాపర్ గా, స్టార్ జూనియర్ కన్సోలేషన్ విభాగంలో సిరిపురం సాయిచరణ్, మేకల భవిష్య, సీనియర్స్ విభాగంలో రేగూరి మనస్వి, బైరగోని సుహాని, పెద్ది సిరి నిలవగా వారికి నగదు బహుమతులు అందజేశారు. నవనీత రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనందుకు ప్రత్యేకంగా ఆవిద్యార్థినిని అభినందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పుల శ్రీనివాస్, కో కరస్పాండెంట్ ఉప్పుల సత్యం, ట్రస్మా రామడుగు మండల అధ్యక్షులు పంజాల జగన్మోహన్ గౌడ్, న్యాయవాది చామనపల్లి రమేశ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.