
సానుకూలంగా స్పందించిన తహసిల్దార్
భీమారం, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాంగ్రెస్ నాయకులు శుక్రవారం రోజున తహసిల్దార్ ని మర్యాదపూర్వకంగా కలిసి మండలాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేయాలని కోరడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016 వ సంవత్సరంలో మండలాన్ని ఏర్పాటు చేశారు. అప్పటినుండి మా ప్రాంతం అభివృద్ధిలో వెనకాలే ఉంది. మా మండల ప్రజల సమస్యల సౌకర్యం కొరకు మండల రెవెన్యూ ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలు జూనియర్ కాలేజ్, బస్టాండ్, బస్టాండ్ వద్ద స్వచ్ఛ టాయిలెట్స్, క్రీడాస్థలం నిర్మించడానికి స్థలం ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానికి తహసిల్దార్ తప్పకుండా స్థల సేకరణ అభివృద్ధిలో తోడ్పడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భీమారం మండలం కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్, శ్యామ్ సురేందర్ రెడ్డి, అలకాటి తిరుపతి, తాయినేని రవి, చందన వేణి అజయ్, ఆవిడపు రవితేజ, బునేని సుధాకర్, పందుల మధుకర్, ఆవుల సురేష్ లు పాల్గొన్నారు.