మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నాం
బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్ బిల్లు!
నారబోయిన స్వరూపరాణి రవి ముదిరాజ్, జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ మరియు జెడ్పిటిసి మునుగోడు
పార్లమెంటు మరియు శాసనసభల్లో 33% మహిళా రిజర్వేషన్ కు ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్ ను స్వాగతిస్తున్నాము, చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది, బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడి, పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్ బిల్లు. మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు ఓబీసీ రిజర్వేషన్ బిల్లును కూడా తీసుకురావాలి.