AP Shines as Investment Hub
*చారిత్రాత్మిక వేదికగా నిలిచిన విశాఖ సిఐఐ సదస్సు..
*పెట్టుబడులకు ఏపీని గమ్య స్థానంగా నిలిపిన చంద్రబాబు..
*అన్ని ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు..
*వేగంగా అభివృద్ధి చెందనున్న రాయలసీమ..
*మీడియా సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి..
పలమనేరు(నేటి ధాత్రి)
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మిక వేదికగా విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు నిలిచిందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. విశాఖలో రెండు రోజులు పాటు జరిగిన సిఐఐ సమ్మిట్ విజయవంతం కావడంపై పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడడం మాత్రమే కాదని మన రాష్ట్రంపై గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందన్నారు. పెట్టుబడులు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా రావడం ప్రభుత్వ వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనం అన్నారు.ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుంటే ఏపీ అందుకు భిన్నంగా స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండడంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. మొత్తం 613 ఒప్పందాల ద్వారా 13,25, 716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం అని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా చేసిన కృషికి ఈ సదస్సు ప్రతిఫలంగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి వారిరువురు ప్రధాన పరిశ్రమను తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని తెలిపారు. ఈ సమ్మిట్ లో పవర్ సెక్టర్ లో కుదుర్చుకున్న అధిక శాతం పెట్టుబడులు రాయలసీమకే రావడం ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందన్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు డ్రోన్ హబ్ గా, అనంతపురం, కడప,కర్నూలు జిల్లాలు రెన్యూవల్ ఎనర్జీ హబ్ గా, తిరుపతి మ్యానుఫ్యాక్చరింగ్,చిత్తూరు టెక్స్ టై ల్ హబ్ లుగా నిలువనున్నయన్నారు.ఇక రాయలసీమ కేంద్రంగా ఏరో స్పేస్ రంగాల్లో 1200 కోట్లతో రేమాన్ సంస్థ పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో రాయలసీమ ఏరోస్పెస్ సిటీగా ఎదిగేందుకు దోహదం కానందున్నారుగతంలో రాయలసీమలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకంజ వేసిన కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వ స్థిరత్వం, పారదర్శకత చూసి ముందుకు వస్తుండడంతో రాయలసీమ వేగంగా అభివృద్ధి చెందనుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయనతో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
