వాయు కాలుష్య కోరల్లో ఆ గ్రామం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి: కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామంలో పిరమిల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం గ్రామస్థుల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. ఇష్టానుసారంగా పొగ గొట్టాల ద్వారా విడుదలవుతున్న విషపూరిత రసాయనాలతో గ్రామంలోని నీటి వనరులు పూర్తిగా కలుషితమయ్యాయి. దీంతో గ్రామంలో కిడ్నీ బాధితులు పెరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముడుపులు తీసుకుని పరిశీలనకు రావడం తప్ప, సమస్య పరిష్కరించడం లేదని ఆరోపిస్తున్నారు.