— ఈ గ్రామంలో అమ్మవారి ప్రతిష్ఠ
ఇదే మొదటిసారి.
నిజాంపేట: నేటి ధాత్రి
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో మొదటిసారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో ఎన్నడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరగలేదని ఈ వర్షాకాలం వర్షాలు సంమృద్ధిగా కురవడంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మొదటిసారి నిర్వహించడం జరిగిందన్నారు. రెండవ రోజు గాయత్రి మాత అలంకరణలో దర్శనం ఇవ్వడం జరిగిందన్నారు. 9 రోజుల పాటు గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారు రోజుకో అవతారంలో పూజలు అందుకోనున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు బిజెపి మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, లింగం, రామచంద్రం, మహేష్, స్వామి, మధు, శ్రీను, రాజు, కార్తీక్ లో ఉన్నారు.