మహాదేవపూర్- నేటి ధాత్రి:
మండలంలోని కుదురుపల్లి వంతెన వద్ద రాత్రి 8 గంటలకు ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులకు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కావడం జరిగింది. మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందిన సుంకే మధు, ఎజాస్ బేక్ తమ పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో కాలేశ్వరం మహాదేవపూర్ మధ్య ఉన్న కుదురుపల్లి వాగు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మధు తలకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఎజాస్ బేగ్ కాళ్లు మరియు చేతుల వద్ద గాయాలు అయ్యాయి, పలువురి సమాచారంతో మూట ఎనిమిది వాహనం ద్వారా మహదేపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రధమ చికిత్స అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.