
అభివృద్ధికి నోచుకోని కోహిర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడ్డ పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21 వేలకు పైగా జనాభా ఉండడంతో జనవరి 27న మున్సిపాలిటీగా ప్రకటించారు.
మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఇతర అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, దీంతో తమ సమస్యలు తీరుతాయని అనుకున్న ప్రజలకు ఎదురు చూపులు తప్పడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.