వేతనాలు, పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు సమ్మె కొనసాగింపు

 

కొత్త మెనుకు బడ్జెట్ కేటాయించాలని మునుగోడుఎమ్మెల్యేకు వినతి పత్రం
మా సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను నిలదీసిన మధ్యాహ్న భోజన కార్మికులు

నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చండూరు మండలం కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు . పరిష్కరించాలని కోరుతూ బంగారుగడ్డ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన అల్పాహార పథకానికి హాజరైన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మధ్యాహ్న భోజన కార్మికులు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు అవి ఇప్పటివరకు కార్మికుల ఖాతాలో జమ కాలేదని అన్నారు. కొత్తగా విద్యార్థులకు ఉదయం పోషకాలతో కూడిన అల్పాహారం అందించడం సంతోషకరమని అన్నారు కానీ ఇప్పటికే కార్మికులు రాగి జావా కాసిపోస్తున్నారని దీనివలన అదనపు పని భారం ఉన్నప్పటికిని ఎలాంటి పారితోషకం ఇవ్వడం లేదు ఉదయం అల్పాహారం వలన కార్మికులు పాఠశాలకు ఉదయాన్నే రావలసి ఉంటుంది దీని వలన పని భారం పెరిగి సుమారు 10: గంటలు పని చేయవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని అన్నారు. కొత్తగా మేనుకు బడ్జెట్ కేటాయించాలని, ఇప్పటికే చేసిన పనికి బిల్లులు రాక అప్పులు తెచ్చి పెట్టలేక అనేక ఇబ్బందులకు అవమానాలకు గురవుతు, అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెంచిన వేతనం ఏరియర్స్ తో సహా కలిపి చెల్లించాలని అన్నారు కార్మికులకు వంటకు సరిపడా గ్యాస్ను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కాటన్ దుస్తులు డ్రెస్ కోడ్ గా ఇవ్వాలని, ప్రభుత్వమే ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇచ్చి గుర్తింపు కార్డులను ఇవ్వాలని ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

*ఈ కార్యక్రమంలో యూనియన్ మండల కార్యదర్శిముత్తవాని,మండల ఉపాధ్యక్షులుపల్లె కవిత,మండల కమిటీ సభ్యులులక్ష్మమ్మ,యాదమ్మ,మరియమ్మ,సీత యాదమ్మ,కమలమ్మ,ఇరిగి యాదమ్మ, కట్ట హిందూతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!