వడ్ల కొనుగోలులో వేగం పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి….

బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, చివరి వడ్ల గింజ వరకూ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు కోరారు. శనివారం చెన్నూర్ నియోజకవర్గం లోని కోటపల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రాల నుండి వడ్లను తరలించడంలో జాప్యం జరుగుతుందని రైతుల ద్వారా తెలుసుకోవడం జరిగిందని అన్నారు .నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ….వడ్ల కొనుగోలు కేంద్రానికి ధాన్యం రాగానే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయించాలన్నారు. కేవలం సన్నాలకే రూ.500 బోనస్‌ ఇవ్వడం మంచిది కాదన్నారు. తరచూ వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రంలో నిల్వచేసిన ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందికి గురికాకుండా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. రైతులకు మిల్లర్లు తక్షణమే డబ్బు చెల్లించాలని కోరారు. ప్రస్తుత నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నియోజకవర్గానికి వచ్చి రైతులకు న్యాయం చేసేలా లేడని, కనీసం అధికారులు అయినా వడ్లను కొనుగోలు చేసేలా చొరవ తీసుకోవాలని, రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్యాక్స్ చైర్మన్ సాంబ గౌడ్ నాయకులు సత్యనారాయణ, విద్యాసాగర్, సంపత్ ,సందీప్ రెడ్డి ,బాపు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!